ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మా మనస్సులో – మాతామహులు – మాడపాటి హనుమంతరావు గారు

  మాడపాటి హనుమంత రావు  22.01.1885 - 11.11.1970 మా మాతామహుల జీవితం ఒక తెరచిన పుస్తకం వంటిది. తెలంగాణాంధ్ర ప్రజలందరికి వారు సుపరిచితులే. ఈ నాటికి కూడా వారందించిన సమాజసేవా కార్యక్రమాలు, భాషోద్యమాలు, గ్రంధాలయోద్యమాలు, స్త్రీ విద్యకై వారు చేసిన కృషి మొదలైనవి ఎందరో మహానుభావులు వ్యాసాల, రచనల రూపంలో అందజేస్తునేవున్నారు. మాకు మాతాత గారితో గల అనుబంధము, అనుభవాలను, మా సంతతికి తెలియచేయాలనే ఉద్దేశమే ఈ వ్యాసానికి ప్రేరణ నిచ్చింది. కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, ఆనాటి బ్రిటీష్‌పరిపాలనా ప్రాంతానికి, నైజాం పరిపాలనకు సరిహద్దు ప్రదేశం. నిస్వార్థంగా సమాజాభివృద్ధికై కృషి చేసిన, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఈ ముగ్గురూ నందిగామకు చెందినవారగుట ఒక విశేషం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన మా తాతగారు, అన్న తిరుమలరావు, తల్లి వెంకట సుబ్బమ్మ, మేనమామలైన జమలాపురం వెంకట్రావు, రామచంద్రరావు వద్దకు చేరారు. హనుమంతరావు తాతగారు చదువు కొంత వరకు సూర్యాపేటలోనే సాగింది. మేనమామలు వీరిని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించారు. వీరు యుక్త వయస్కులయ్యే నాటికి మేనమామలు కాలధర్మం చెందా
ఇటీవలి పోస్ట్‌లు

ఆత్మీయులు కొత్తపల్లి సుబ్బరామయ్య గారు

 సుబ్బరామయ్యగారి గురించి రాయటం అంటే, నాకు ఒకరకంగా సాహసం తో కూడిన పని అనిపిస్తుంది. ఈయన వెండితెర నాయకుడు, గాయకుడు కాదు. కాని, ‘సామాజిక స్పృహ’ కలిగిన మానవతావాది. ఇటువంటి వ్యక్తి అనామకుడుగా సమాజంలో నిలిచిపోకూడదు అనే భావన ఈ నా రచనకు నాందిపలికింది. 1942వ  సంవత్సరమున - సంస్కృతి గ్రంథమండలి - చెన్నపట్నం వారు, నేటి జపాన్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తక రచయిత మరెవరోకాదు, సుబ్బరామయ్య గారు. అందులో ఆయన తనని గురించి విషయాలు కొన్ని తెలిపారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో (దాదాపు 110 సంవత్సరాల క్రితం) సుబ్బరామయ్య గారి తల్లిదండ్రులు ఒంగోలు నుంచి చెన్నపట్నంకి  వచ్చి జీవనం సాగించారు. అతిసామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వారిది. ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే. వీరి పై చదువులనాటికి ఆర్ధిక పరిస్ధితి బాగా కుంటుపడ్డది అని చెప్పాలి. ఆయన ఫిబ్రవరి 1వ తేదీ, 1910వ సంవత్సరంలో పెరంబూరు లో జన్మించారు. బాల్యం అంతా అక్కడే గడిచింది. విద్యాభ్యాసం అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు లో పూర్తి చేసుకొని, 1928 నాటికి చెన్నపట్నం వచ్చి ఉద్యోగంలో చేరారు.  అవి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్న రోజులు, 1931వ ప్రాంతము. ఎక్కడ చూసినా, వ